![]() |
![]() |

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -167 లో....నర్మద, సాగర్ ఇద్దరు కాఫీ తాగడానికి బయటకి వెళ్తారు. అక్కడ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఫొటోస్ తీసుకుంటారు. ఈ ఫొటోస్ ప్రేమకి పంపిస్తానని నర్మద పంపిస్తుంటే.. వద్దు ఇంట్లో ఇంకా ఎవరైనా చూస్తారని సాగర్ భయపడతాడు. ఏం కాదని నర్మద పంపిస్తుంది.
ఆ తర్వాత ఆ ఫొటోస్ చూసి ప్రేమ హ్యాపీగా ఫీల్ అవుతుంది. వెంటనే వేదవతి కి చూపిస్తుంది. అవి చూసి ఎంత బాగున్నాయో అని తను అంటుంది. అదంతా చూస్తున్న శ్రీవల్లి అవేంటో కనుక్కోవాలనుకుంటుంది కానీ శ్రీవల్లి వెళ్ళగానే వాళ్ళు టాపిక్ డైవర్ట్ చేస్తారు. మళ్ళీ నన్ను పరాయి దానిలాగా చూస్తున్నారని యాక్టింగ్ చేస్తుంది. అదేం లేదమ్మ అంటూ శ్రీవల్లి కి నర్మద ఫొటోస్ చూపిస్తుంది. ఆ ఫొటోస్ చూసి ఓర్వలేక వీళ్ళ సంగతి చెప్పాలని శ్రీవల్లి అనుకుంటుంది. ఆ తర్వాత రాత్రి అందరు భోజనం చేస్తుంటారు. సాగర్ ఫోన్ స్విచ్చాఫ్ వస్తుందని రామరాజు అంటాడు. వాళ్ళు ఏమైనా ఫోన్ చేసారా అని రామరాజు అంటాడు. చెయ్యలేదు కానీ ఫొటోస్ పంపిందని శ్రీవల్లి చెప్తుంది. ఏంటి ప్రేమ ఫొటోస్ చూపించని శ్రీవల్లి అంటుంది.
ప్రేమ ఫొటోస్ చూపిస్తుంది. ఫొటోస్ చూసి వాడు ఫోన్ అఫ్ చేసి పెళ్ళాం తో షికారుకి వెళ్లిండు.. బాధ్యత తెలియదంటూ రామరాజు కోప్పడతాడు. తరువాయి భాగం లో సాగర్, నర్మద ఇంటికి వస్తారు. ఫోన్ ఎందుకు ఎత్తట్లేదని సాగర్ ని తిడతాడు రామరాజు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |